“సలార్” కి ఇది గోల్డెన్ ఆఫర్ !

“సలార్” కి ఇది గోల్డెన్ ఆఫర్ !
Cinema New

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. ఈ మూవీ థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. ఇప్పటి వరకూ 500 కోట్ల రూపాయల వసూళ్లని రాబట్టడం జరిగింది ఈ మూవీ . అయితే నేటి నుండి సినిమాకి రెగ్యులర్ టికెట్ రేట్స్ ఉండనున్నాయి. ఇది సినిమాకి గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి.

“సలార్” కి ఇది గోల్డెన్ ఆఫర్ !
Salaar Movie

వీకెండ్ స్టార్ట్ కావడం, అది కూడా న్యూ ఇయర్ వీకెండ్ అవ్వడం తో మంచి వసూళ్లని రాబట్టే అవకాశాలు ఎక్కువ గా కనిపిస్తున్నాయి. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, పృథ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.