మంచిర్యాలలో పిడుగు పాటుకు ఇద్దరు మృతి

మంచిర్యాలలో పిడుగు పాటుకు ఇద్దరు మృతి

మంచిర్యాల జిల్లాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. కాగా, జిల్లా కేంద్రంలో ఓ ఫై ఓవర్‌ బ్రిడ్జ్‌పై వర్షంలో టూవీలర్‌పై ప్రయాణిస్తున్న ఒక కుటుంబం పిడుగు పాటుకు గురైంది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న సదరు వ్యక్తి భార్య, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు.

మరోకరి పరిస్థితి విషమంగా ఉంది.వెంటనే స్థానికులు వారిని సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఒకే కుటుంబంలో ఇద్దరు పిడుగుపాటుకు గురై చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.