“టిల్లు”: యునైటెడ్ స్టేట్స్ లోనూ తెలుగు మూవీ సత్తా చాటింది ..!

"Tillu": The Telugu movie has shown success in the United States too..!

ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రేజీ ఎంటర్టైనర్ మూవీ “టిల్లు స్క్వేర్”. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ మూవీ లో యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించింది. అయితే ఈ మూవీ డీజే టిల్లు కి సీక్వెల్ గా వస్తుండగా దానికి డబుల్ ఎంటర్టైన్మెంట్ ని జోడించి మేకర్స్ తీసుకొస్తున్నట్టుగా తెలుపుతున్నారు.

ఇక ఈ మూవీ యూఎస్ లో కూడా సాలిడ్ బుకింగ్స్ రిజిస్టర్ చేస్తుంది. మరి లేటెస్ట్ గా అయితే ఈ మూవీ జస్ట్ ప్రీ సేల్స్ లోనే 2 లక్షల డాలర్స్ కు పైగా రాబట్టేయడం విశేషం. దీనితో ఈ మూవీ పట్ల యూఎస్ ఆడియెన్స్ మంచి ఆసక్తిగానే ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. మరి టోటల్ ప్రీమియర్ నంబర్స్ ఎంత వరకు వెళ్తాయో అనేది చూడాలి.

"Tillu": The Telugu movie has shown success in the United States too..!
“Tillu”: The Telugu movie has shown success in the United States too..!

గతంలో మొదటి పార్ట్ కు యూఎస్ లో భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. మరి ఈ మూవీ కి ఎలాంటి వసూళ్లు వస్తాయో చూడాలి. ఇక ఈ మూవీ కి రామ్ మిర్యాల, భీమ్స్ లు సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ 4 మూవీ స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఈ మార్చ్ 29న మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.