మోక్షజ్ఞతో టాలీవుడ్ హీరోయిన్ శ్రీ లీల వివాహం ?

మోక్షజ్ఞతో టాలీవుడ్ హీరోయిన్ శ్రీ లీల వివాహం ?
Latest News

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం శ్రీ లీల ట్రెండ్ నడుస్తోంది. ఎక్కడ చూసినా శ్రీలీల పేరు మార్మోగుతోంది. పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన శ్రీ లీల… ఆ తర్వాత రవితేజ నటించిన ధమాకాలో దుమ్ము లేపింది. రవితేజకు సమానంగా డాన్స్ అలాగే యాక్ట్ చేసి ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకుంది శ్రీ లీల. దీంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏకంగా పది సినిమాలు చేయబోతుంది హీరోయిన్ శ్రీ లీల.

మోక్షజ్ఞతో టాలీవుడ్ హీరోయిన్ శ్రీ లీల వివాహం ?
Balakrishna. Sree Leela, Mokshagna

ఇక ఇటీవలనే బాలయ్య నటించిన భగవత్ కేసరి సినిమాలో హీరోయిన్ శ్రీ లీల నటించింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తుంది శ్రీ లీల. అయితే భగవంతు కేసరి సినిమా… ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో హీరోయిన్ శ్రీ లీల సందడి చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈవెంట్ నేపథ్యంలో… నందమూరి బాలయ్య కొడుకు మోక్షాజ్ఞతో హీరోయిన్ శ్రీ లీల కాస్త చనువుగా కనిపించింది.

అలాగే నందమూరి బాలకృష్ణ, మోక్షజ్ఞలతో శ్రీ లీల ఫోటోలు దిగింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో…. శ్రీ లీలా మరియు మోక్షజ్ఞ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వైరల్ చేస్తున్నారు కొంత మంది. త్వరలోనే వీరిద్దరి వివాహం జరగబోతుందని కూడా పేర్కొంటున్నారు. అయితే ఈ వార్తలపై భగవంతు కేసరి టీం స్పందించింది. హీరోయిన్ శ్రీ లీల , మోక్షజ్ఞ మద్య ఎలాంటి సంబంధం లేదని… వారి పెళ్లిపై వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొంది మూవీ టీం.