“తండేల్” లాంచింగ్‌లో టాలీవుడ్ కింగ్స్ వెంకటేష్, నాగార్జున

Cinema News

యువ నటుడు అక్కినేని నాగచైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు గ్రాండ్ గా నిర్మించనున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా తండేల్. ఇటీవల ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయి అందరిలో సినిమా పై మంచి ఇంట్రెస్ట్ ఏర్పరిచింది. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ని చందూ మొండేటి తెరకెక్కిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు.

"తండేల్" లాంచింగ్‌లో టాలీవుడ్ కింగ్స్ వెంకటేష్, నాగార్జున
Akkineni Naga Chaitanya

ఇక ఈ క్రేజీ ప్రాజక్ట్ రేపు అన్నపూర్ణ స్టూడియోలో ఉదయం 10 గం. 30ని. లకు గ్రాండ్ లెవెల్లో లాంచ్ కానుండగా ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ హీరోలైన కింగ్ అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ ప్రత్యేకంగా హాజరు కానున్నట్లు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా తెలియచేసారు . ఇక ఈ సినిమా యొక్క రెగ్యులర్ షూట్ అతి త్వరలో ప్రారంభం కానున్నది . కాగా వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కనున్న తండేల్ సినిమా తప్పకుండా కెరీర్ పరంగా నాగచైతన్య కెరీర్ లో బెస్ట్ సినిమా గా నిలుస్తుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు.