ప్రముఖ నిర్మాత మృతి…విషాదంలో టాలీవుడ్

ప్రముఖ తెలుగు సినీ నిర్మాత కోనేరు అనిల్ కుమార్ కన్నుమూశారు. కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న అనిల్ కుమార్ హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. హీరో శ్రీకాంత్ కు సన్నిహితుడైన అనిల్ కుమార్ ఎన్నో హిట్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. కె.రాఘవేంద్రరావు రూపొందించిన ‘అల్లరి బుల్లోడు’, బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాధా గోపాళం’తో పాటు ‘ఒట్టేసి చెబుతున్నా’ తదితర చిత్రాలకు అనిల్ కుమార్ నిర్మాతగా వ్యవహరించారు. అనిల్ కుమార్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.