ప్రభాస్ ‘సలార్’ సినిమా లో త్రిష, ఐశ్వర్య రాయ్.. ఏందయ్యా ఇది!

ప్రభాస్ ‘సలార్’ సినిమా లో త్రిష, ఐశ్వర్య రాయ్.. ఏందయ్యా ఇది!
Latest News

ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇతని నటనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. మన పాన్ ఇండియన్ స్టార్ హీరో అయినటువంటి ప్రభాస్ కి సంబంధించి సలార్ సినిమా అప్డేట్ గురించి తన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. టీజర్ లో ప్రభాస్ క్యారెక్టర్ ని, జురాసిక్ పార్క్ లో డైనోసార్ తో కంపేర్ చేయడంతో ఫ్యాన్స్ దీన్ని చూసి సంబరాలు చేసుకుంటున్నారు. పైగా ఒక్క డైలాగ్ కూడా లేని టీజర్ తో వరల్డ్ వైడ్ గా ఈ టీజర్ షేక్ చేసింది.

ప్రభాస్ ‘సలార్’ సినిమా లో త్రిష, ఐశ్వర్య రాయ్.. ఏందయ్యా ఇది!
Prabhas ” Salar Movie”

సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొంచెం వర్క్ పూర్తి కాకపోవడంతో ఈ సినిమాని వాయిదా వేశారు. దీంతో ఈ సినిమాకు సంబంధించి నెక్స్ట్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. దీంతో ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో ఓ ప్రచారం ప్రభాస్ అభిమానులను గాల్లో ఎగిరేలా చేస్తుంది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ట్రైలర్ వచ్చేస్తుందని ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అప్పుడే ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సలార్ సినిమా వాయిదా పడిందన్న బాధలో ఉన్న ప్రభాస్ అభిమానులకు ఓ క్రేజీ న్యూస్ తన అభిమానులకు కాస్త ఊరట కల్పించింది.

దాదాపు ఈ సినిమాని 300 కోట్ల బడ్జెట్ తో రూపొందించనున్నారు. ఈ సినిమాలో యాక్షన్ ఎలివేన్స్ సీన్లను అద్భుతంగా చిత్రీకరించారట. అంతేకాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ తో స్పెషల్ సాంగ్ ని చేయించనున్నారట. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ కాకపోతే త్రిష ను బరిలోకి దింపనున్నారంట . కాగా, ప్రస్తుతం ప్రభాస్ తన మోకాలి గాయంతో ఇబ్బంది పడుతు ఉన్నారు . తను గాయం నుంచి పూర్తిగా కోరుకున్న తర్వాత పాటను షూట్ చేయాలని అనుకుంటున్నారట. నెవెర్ బిఫోర్ అనేలా ఈ పాటను తెరకెక్కించాలని భావిస్తున్నారట.