చిరుతో సినిమా చేయనన్న త్రిష

చిరుతో సినిమా చేయనన్న త్రిష

మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాకి సంబధించి ఒక షాకింగ్ న్యూసే. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషని ఎంపిక చేశారు. కొంత షూటింగ్ కూడా జరిగింది. అయితే ఇప్పుడీ సినిమా నుండి బయటికి వచ్చేసింది త్రిష. అవును.. ఈ సినిమా ఆమె చేయడం లేదు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించింది. ”కొన్ని విషయాలు మారిపోతుంటాయి. ముందు ఒకలా తర్వాత మరోలా. క్రియేటివ్ అంశంలో భిన్నాభిప్రాయాల వల్ల చిరంజీవి సర్ సినిమాలో నటించకూడదని నిర్ణయించుకున్నా. యూనిట్ కి అభినందనలు. ఆల్ ది బెస్ట్ ” అని ట్వీట్ చేసింది త్రిష. అయితే దిని వెనుక స్పష్టంమైన రీజన్ మాత్రం చెప్పలేదు. ఒక హీరోయిన్ ఇలా మధ్యలో సినిమా వదిలేయడం పెద్ద విషయం కాదు కానీ ఇది మెగాస్టార్ సినిమా. అందులోనూ రామ్ చరణ్ నిర్మాత. త్రిష ట్వీట్ చూస్తూ.. మొదటి ఒకలా చెప్పి ఇప్పుడు మరో మాట్లాడుతున్నారనే సెన్స్ కనిపిస్తుంది. మొత్తానికి త్రిష హర్ట్ అయ్యిందనే సంగతి అర్ధమౌతుంది. మరి పరిణామానికి కారణం ఏంటో త్వరలోనే బయటికొస్తుంది.