టైటిల్‌, ఫస్ట్‌లుక్‌పై సర్వత్రా ఆసక్తి

trivikram planning on Ntr 28 Movie First Look Title Release

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌కు రంగం సిద్దం అవుతుంది. ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్బంగా త్రివిక్రమ్‌ ఫస్ట్‌లుక్‌ను ఇప్పటికే రెడీ చేసి పెట్టాడు. అలాగే ఈ సినిమాకు టైటిల్‌గా ఏది ఖరారు చేశాడు అనే విషయంలో క్లారిటీ రాలేదు. మొదట ఈ చిత్రానికి ‘అసామాన్యుడు’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే పవన్‌ కళ్యాణ్‌తో ఈయన నిర్మించిన అజ్ఞాతవాసి చిత్రం టైటిల్‌ అ అక్షరంతో ప్రారంభం అయ్యింది. ఆ సినిమా ఫ్లాప్‌ అయ్యి పవన్‌ మొత్తానికి సినిమాలకు దూరం అయ్యేలా చేసింది. ఇప్పుడు అదే అ అక్షరంతో ఎన్టీఆర్‌ సినిమా టైటిల్‌ వద్దంటే వద్దు అంటూ ఫ్యాన్స్‌ కోరుతున్నారు. దాంతో త్రివిక్రమ్‌ మనసు మార్చుకున్నట్లుగా తెలుస్తోంది.

ఎన్టీఆర్‌ సినిమాకు ‘రారా కుమారా’ అనే టైటిల్‌ను అనుకుంటున్నాడు. ఈ టైటిల్‌ మరీ క్లాసీగా ఉందని, మాస్‌ ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయ్యే విధంగా లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది అసలు ఖరారు చేశారా లేదా అనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు. ఎన్టీఆర్‌ సినిమా కోసం అని మాత్రమే కాకుండా తాను ఏ సినిమా చేసినా కూడా దర్శకుడు త్రివిమ్ర్‌ టైటిల్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. టైటిల్‌తోనే సినిమాకు సంబంధించిన సగం కథను చెప్పేయాలని దర్శకుడు భావిస్తాడు. సినిమా చూసిన తర్వాత టైటిల్‌ బాగా సూట్‌ అయ్యిందని అనుకునేలా టైటిల్‌ ఉండాలి అనేది త్రివిక్రమ్‌ ఆలోచన. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ఏ ఇతర సినిమాలు అయినా కూడా ఇదే పద్దతిలో టైటిల్‌ ఖరారు చేయబడ్డాయి. అందుకే ఈ సినిమాకు కూడా ఇలాగే టైటిల్‌ను నిర్ణయించనున్నాడు. మరి కొన్ని గంటల్లో సినిమా ఫస్ట్‌లుక్‌ మరియు టైటిల్‌ రివీల్‌ కాబోతుంది.