ఫ్యాన్స్ కు ఇది పండగే..సలార్ ట్రైలర్ రిలీజ్ అప్పుడే..?

ప్రభాస్ “సలార్” ట్రైలర్ రిలీజ్ ..... డేట్ ఇదే
Cinema News

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, కేజీఎఫ్ సిరీస్ సినిమా ల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. ఈ సినిమా ను డిసెంబర్ 22, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. తెలుగు, కన్నడ భాషల్లో మాత్రమే కాకుండా, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు . ఈ పాన్ ఇండియా సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .

ప్రభాస్ “సలార్” ట్రైలర్ రిలీజ్ ..... డేట్ ఇదే
Salaar movie

అయితే ఈ మూవీ కి సంబందించిన ట్రైలర్ రిలీజ్ పై లేటెస్ట్ న్యూస్ ఒకటి వైరల్ గా మారుతోంది. ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ను నవంబర్ చివరి వారం లో లేదా డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో పృథ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా కి రవి బస్రూర్ సంగీతం అందించారు.