“జవాన్” కలెక్షన్ ల సునామీ … మొదటిరోజే రూ. 120 కోట్లు !

తమిళ దర్శకుడు అట్లీ మరియు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన తాజా మూవీ “జవాన్”. నిన్న ఎంతో ఘనంగా థియేటర్ లలోకి అడుగు పెట్టింది. మొదటి షో నుండి ఈ మూవీ పట్ల ప్రేక్షకులలో పాజిటివ్ ఒపీనియన్ రావడంతో కలెక్షన్ లు అద్దిరిపోయాయి. ఈ సంవత్సరం వరుసగా షారుఖ్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ కూడా పడింది. షారుఖ్ ఖాన్ ఈ మూవీ లో అద్భుతంగా నటించి కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ కూడా ఇచ్చాడు. ఇక ఇందులో షారుక్ తో పాటు నటించిన దీపికా పదుకునే, నయనతార, విజయ్ సేతుపతి లు తమకు ఇచ్చిన పాత్రలలో నటించి మూవీ యొక్క విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక నిన్న ఆఖరి షో లు ముగిసే వరకు ఈ మూవీ కు దేశవ్యాప్తంగా రూ. కోట్ల గ్రాస్, ఇక రూ. 70 కోట్ల నెట్ కలెక్షన్ లు సాధించింది. మొదటి రోజే ఈ స్థాయిలో కలెక్షన్ లు రావడం ఇదే మొదటిసారి అంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

థియేటర్లలో తుఫాను సృష్టిస్తున్న జవాన్
Jawan

ఇంతకు ముందు పఠాన్ మూవీ రూ. 57 కోట్లు, కెజిఎఫ్ 2 రూ. 53 .95 కోట్లు , వార్ రూ. 53 .35 కోట్లు , థగ్స్ అఫ్ హిందుస్తాన్ రూ. 52 .20 కోట్లు , మరియు బాహుబలికి కేవలం రూ. 41 కోట్లు మాత్రమే కలెక్షన్ లు కూడా వచ్చాయి.