RRR సినిమా లో రాజమౌళి కొత్త ట్విస్ట్

RRR సినిమా లో రాజమౌళి కొత్త ట్విస్ట్

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో   హీరోలు  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరొకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు మరియు కొమరం భీంల పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఇద్దరూ ఒకరినొకరు ప్రేరణగా తీసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన నుంచి పుట్టిందే ఈ భారీ పీరియాడిక్ డ్రామా.అయితే రాజమౌళి తాను ఏం తీస్తానో చెప్పి మరీ భారీ హిట్ అనుకోవడం ఆనవాయితీగా మార్చుకున్నారు.

అందులో భాగంగానే ఈ సినిమా లైన్ ను కూడా ముందు గానే చెప్పేసారు.అయితే జస్ట్ ఈ రెండు రోజుల నుంచే ఈ చిత్రంపై ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.రామ్ చరణ్ మరియు తారక్ ల మేకోవర్ చూసి కొమరం భీం పాత్రను రామ్ చరణ్ అలాగే అల్లూరి పాత్రను తారక్ లు పోషించే విధంగా కనిపిస్తున్నారని టాక్ మొదలయ్యింది.అలా రాజమౌళి ముందు వీరిద్దరినీ ఒకలా ఆ తర్వాత పాత్రలను మార్చేసి ట్విస్ట్ ఎలా ఇస్తారో చూడాలి.