మిల్కీ బ్యూటీకి Mrs.ప్రొడ్యూసర్ గిఫ్ట్

మిల్కీ బ్యూటీకి Mrs.ప్రొడ్యూసర్ గిఫ్ట్

తమన్నా హావ భావాలు అటు ప్రేక్షకులను “సైరా” అంటూ సాగేపాటలో చాలా ఆకట్టుకుంది. తమన్నాకు కూడా కొత్త ఊపిరినిచ్చిన “సైరానరసింహారెడ్డి” చిత్రంలో నర్సింహారెడ్డి ప్రియురాలు లక్ష్మిగా తన నటనతో “సైరా లక్ష్మి”గా పేరొందుతుంది.

హిట్‌టాక్‌తో దూసుకుపోతున్న సైరానరసింహారెడ్డి చిత్ర విజయాన్ని చిత్రబృందం బాగా ఆనందిస్తున్నారు. చిత్ర నిర్మాత హీరో కొణిదెల రామ్‌చరణ్ భార్య  కొణిదెలఉపాసన కూడా చిత్ర విజయాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు.ట్విటర్‌ద్వారా తన సంతోషాన్ని తెలిపిన ఉపాసన నటి తమన్నాకు బహుమతి అందచేశారట.

తమన్నా అద్భుతమైన నటనకి ఖరీదైన ఉంగరాన్ని బహుమతిగా ఇస్తూ ఉపాసన తమన్నాకి కృతజ్ఞతలు తెలిపారు.