అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌

అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. చీఫ్‌ జస్టిస్‌ రాబర్ట్స్‌ బైడెన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి క్లింటన్‌, జార్జ్‌బుష్‌, ఒబామా కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు.

అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10 గంటలు) లేడీ గాగా జాతీయ గీతాలాపానతో కార్యక్రమం మొదలయ్యింది.

ఆ తర్వాత బైడెన్‌ సతీమణి జిల్‌ బైడెన్‌ ప్రసంగించారు. అనంతరం ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.