ప్రభాస్‌ను పొడిచేసిన బాలీవుడ్‌ హీరో

Prabhas and Bollywood hero Varun Davan has acted with Bahabali2 knife seen

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Varun Dhawan Wants To Kill Baahubali Actor Prabhas

‘బాహుబలి’ మొదటి పార్ట్‌ విడుదలైనప్పటి నుండి కూడా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న అందరి మెదడును తొలిచిన ప్రశ్న. బాహుబలిని కట్టప్ప పొడిచే పోస్టర్‌ను చూపించి ‘బాహుబలి 2’ ప్రమోషన్‌ను చేశారు. దేశంలో ఆ పోస్టర్‌ ఎంతగా ప్రాచుర్యం పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి 2 కు చెందిన ప్రతి పోస్టర్‌లో కూడా ఆ స్టిల్‌ను ఉపయోగించారు. కట్టప్ప వెనుక నుండి బాహుబలిని పొడవడం, బాహుబలి చేతులు చాచి కనిపించడం జరిగింది. తాజాగా మరోసారి ఆ సీన్‌ సరదాగా జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ సినీ ప్రముఖులకు పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీకి టాలీవుడ్‌ నుండి రానా మరియు ప్రభాస్‌లు హాజరు అయ్యారు. ఆ సమయంలోనే బాహుబలి కత్తితో ప్రభాస్‌ను బాలీవుడ్‌ హీరో వరుణ్‌ దావన్‌ పొడిచినట్లుగా యాక్టింగ్‌ చేశాడు. దాంతో ప్రభాస్‌ అచ్చు సినిమాలో మాదిరిగా ఫోజ్‌ పెట్టాడు. ఆ ఫోజ్‌ను అక్కడే ఉన్న ఇతర స్టార్స్‌ తమ కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

మరిన్ని వార్తాలు :

ఫిదా మూవీ లేటెస్ట్ టీజర్ అదుర్స్…

లుంగీ రాజా కి చిరు క్లాస్?