కొత్తజంట తో మెగా మొనగాళ్లు..స్పెషల్ గా పవన్

వరుణ్-లావణ్య పెళ్లిలో మెగా హీరోల సందడి ..... .!
Cinema News

Varun-Lavanya wedding : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల వివాహం అనంతరం మెగా హీరోలంతా కలిసి ఫోటోదిగారు. కొత్త జంటకు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ విషెస్ తెలిపారు. ఈ ఫోటోను మెగాస్టార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వారు ప్రేమతో నిండిన కొత్త జీవిత ప్రయాణాన్ని ప్రారంభించారు. స్టార్ కపుల్ కు స్టార్ల శుభాకాంక్షలు’ అని రాసుకొని వచ్చారు .

ఇది ఇలా ఉండగా.. టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి ల వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టస్కానీ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ లో ఈ జంట బుధవారం రాత్రి 7.18 గంటలకు మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టారు . ఇరు కుటుంబాల వారు, అత్యంత సన్నిహితుల మధ్య వరుణ్-లావణ్యల వివాహ వేడుకలు చాలా ఘనంగా జరిగింది.