ఇలియానాను పెళ్లి చేసుకుంటాను అన్న వరుణ్ సందేశ్

ఇలియానాను పెళ్లి చేసుకుంటాను అన్న వరుణ్ సందేశ్

తెలుగు బుల్లితెర రంగంలో అతి తక్కువ కాలం టెలికాస్ట్ అయ్యే అత్యంత పాపులారిటీని సొంతం చేసుకున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే అది “బిగ్ బాస్” అని చెప్పాలి.స్టార్ మా ఛానెల్లో ప్రసారం అయ్యే ఈ షో ఇప్పటి వరకు మూడు సీజన్లను పూర్తి చేసుకుంది.అయితే ఈ మూడింటిలో ఇటీవలే చేసిన సీజన్ 3 మాత్రం రికార్డు స్థాయి టీఆర్పీలను నెలకొల్పింది.దీనికి కింగ్ నాగార్జున ఒక కారణం కావడమే కాకుండా బాగా తెలిసిన కంటెస్టెంట్స్ కూడా ఉండడం మరో ప్లస్ పాయింట్ అని చెప్పాలి.

అయితే ఈ సీజన్ ద్వారా మంచి పాజిటివ్ ఒపీనియన్ తెచ్చుకున్న కంటెస్టెంట్ ఎవరన్నా ఉన్నారు అంటే అది వరుణ్ సందేశ్ అని చెప్పాలి. ఈ షో ద్వారా వరుణ్ మరియు అతని భార్య వితికాలకు మంచి పేరు వచ్చింది.అయితే బిగ్ బాస్ 3 అయ్యాక వీరిద్దరూ మిగతా కంటెస్టెంట్స్ తో పోల్చుకుంటే బయట పెద్దగా కనిపించింది లేదు.కానీ ఈసారి ఈ ఇద్దరూ ఈటీవీలో ప్రసారం అయ్యే “ఆలీతో సరదాగా” షోకు వచ్చే వారం టెలికాస్ట్ కాబోయే ఎపిసోడ్ గెస్టులుగా వచ్చారు.

అయితే ఈ ప్రోమోలో ఆలీ మంచి ఆసక్తికరమైన ప్రశ్నలే వీరిద్దరినీ అడిగారు.వాటిలో వితిక కానట్లయితే ఏ హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటావ్ అని వరుణ్ అడగ్గా వితికా కానట్లయితే తనకి హీరోయిన్ ఇలియానా అంటే చాలా ఇష్టమని తన మనసులో మాట చెప్పేసాడు.అంటే పెళ్లి చేసుకుంటాను అన్న మాట అనలేదు కానీ ఇలియానా అంటే ఇష్టం అని చెప్పేసాడు.మరి ఆ తర్వాత ఏమన్నాడో తెలియాలి అంటే వచ్చే ఫిబ్రవరి 10 సోమవారం ఈ ఎపిసోడ్ ను మిస్సవకుండా చూడాల్సిందే.