శాంటా క్లాజ్ గా మారిన హీరో విజయ్ దేవరకొండ

శాంటా క్లాజ్ గా మారిన హీరో విజయ్ దేవరకొండ

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం “వరల్డ్ ఫేమస్ లవర్” అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే విజయ్ ను ఎంతైతే అభిమానించే వారున్నారో అంతే స్థాయిలో ట్రోల్ చేసేవారు కూడా ఉన్నారు.అయినప్పటికీ విజయ్ వాటిని చాలా స్పోర్టివ్ గానే తీసుకున్నారు.అయితే తాజాగా గత ఏడాది క్రిస్మస్ సందర్భంగా తన ఫాలోవర్స్ కు తానే కోరికలు తీర్చే శాంటా క్లాజ్ గా మారి ఎవరు ఏది కోరుకుంటే అది గిఫ్ట్ గా ఇస్తానని చెప్పాడు.అయితే ఆ టైం లో విజయ్ ఏదో సరదాగా చెప్తున్నాడని అనుకోని చాలా మందే సరదాగా వారికి ఏమేం కావాలో అడిగారు.

అలాంటి వాటిలో లక్షల ధర పలికేవి కూడా ఉన్నాయి.అయితే అది అప్పటికి అయ్యిపోయింది.కానీ విజయ్ మాత్రం తాను చెప్పిన మాటను నిజం చేస్తూ ఒక్కొక్కరికి వాళ్ళు కోరుకున్న గిఫ్టులు పంపించడం మొదలు పెట్టాడు.తన టీం సహాయంతో ఈరోజే ఒక వ్యక్తికి అక్షరాలా లక్ష 50 వేల రూపాయల ఖరీదు కల “ఆపిల్ మ్యాక్ బుక్ ప్రో” ను పంపి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు.దీనితో ఈ విషయాన్ని ఆ వ్యక్తి తన సోషల్ మీడియా ద్వారా పంచుకొని విజయ్ కు మరియు అతని టీం కు ఓ పెద్ద థాంక్స్ చెప్పాడు.మొత్తానికి మాత్రం విజయ్ వ్యక్తిగా మరో మెట్టు పైకి ఎక్కేసాడని చెప్పాలి.