గోవిందంకు చిరు నుండి షాకింగ్‌ ప్రశంసలు…!

Vijay Devarakonda Is Another Power Star

విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘గీత గోవిందం’ చిత్రం గత వారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సినీ వర్గాల వారు, చిత్ర యూనిట్‌ సభ్యులు, ట్రేడ్‌ వర్గాల వారు ఇలా ఏ ఒక్కరు ఊహించని విధంగా ఈ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేసింది. మొదటి మూడు రోజుల్లోనే దాదాపుగా 40 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను రాబట్టి సత్తా చాటింది. లాంగ్‌ రన్‌లో ఈ చిత్రం సంచలన వసూళ్లు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇంత భారీ విజయాన్ని దక్కించుకున్న చిత్ర యూనిట్‌ సభ్యులు చిరంజీవి ప్రత్యేక అతిథిగా సక్సెస్‌ వేడుకను నిర్వహించడం జరిగింది.

cherangeevi

సక్సెస్‌ వేడుకలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ హీరో విజయ్‌ దేవరకొండపై ప్రశంసల జల్లు కురిపించాడు. నా కెరీర్‌లో ‘ఖైదీ’ చిత్రం ఎంతగా నిలిచి పోయిందో, ఎంతటి విజయాన్ని దక్కించుకుని ఇప్పటి వరకు గుర్తుండి పోయిందో విజయ్‌ దేవరకొండ కెరీర్‌లో కూడా గీత గోవిందం చిత్రం అంతగా నిలిచి పోతుందని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంతో విజయ్‌ స్టార్‌ హీరో అయ్యాడు అంటూ చిరంజీవి పేర్కొన్నాడు. ఇకపై విజయ్‌ దేవరకొండ స్టార్‌ అంటూ అంతా సంభోదిస్తారు అంటూ చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేశాడు. సక్సెస్‌ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా విజయ్‌ దేవరకొండపై ప్రశంసల వర్షం కురిపించారు. విజయ్‌ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ అంటూ చెబుతూ వస్తున్నారు.

vijay-devarakonda-cheranjee