విజయ్ దేవరకొండ న్యూ మూవీ… రౌడీ తో ఛాన్స్ కొట్టేసిన మృణాల్

విజయ్ దేవరకొండ న్యూ మూవీ... రౌడీ తో ఛాన్స్ కొట్టేసిన మృణాల్
Vijay Mrunal

స్ట్రాంగ్​గా కమ్ బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు విజయ్ దేవరకొండ. అందుకే బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేస్తూ వచ్చే ఏడాదంతా బిజీబిజీగా గడిపేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే శివ నిర్మాణ దర్శకత్వంలో.. సమంత హీరోయిన్​గా.. విజయ్ హీరోగా ఖుషి సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రానుంది.

మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో.. శ్రీలీల హీరోయిన్​గా నటిస్తున్న #VD12 సినిమాలోనూ విజయ్ నటిస్తున్నాడు. కొన్నిరోజుల క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. ఇది ఇంకా సెట్​పైకి వెళ్లనే లేదు.. అంతలోనే.. #VD13 కు రంగం సిద్ధం అయింది. గీతాగోవిందం ఫేమ్ పరశురాం దర్శకత్వంలో విజయ్ మరోసారి నటిస్తున్న విషయం తెలిసిందే ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా కోసం ఎప్పటి నుంచో ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.

అనుకున్నట్టుగానే ఆ ప్రాజెక్టును కొంతసేపటి క్రితం లాంచ్ చేశారు.హైదరాబాదులో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది.. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ఈ కాంబోలో తెరకెక్కనున్న సినిమాకు ఇవాళ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పాల్గొంది. విజయ్ – మృణాల్ పై నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టారు.