వెంకీ రూట్ లోకి మోహన్ బాబు.

Vishnu special role in mohan babu gayathri movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఎస్ … పైన పెట్టిన టైటిల్ అక్షరాలా నిజం. ఇంతకీ ఏమిటా నిజం అనే కదా మీ ఆత్రం. వెంకీ లాగా మోహన్ బాబు కూడా మల్టి స్టారర్ చేయబోతున్నాడా… లేక ఆయనలా ఆధ్యాత్మిక రూట్ లోకి వెళుతున్నాడా? ఇలాంటి డౌట్ లు వస్తే మీరు పప్పులో కాలేసినట్టే. లక్ష్మి,తులసి లాంటి టైటిల్స్ పెట్టే ధైర్యం చేసి హిట్ కొట్టిన వెంకీ టైపు లో తన కొత్త సినిమాకు మోహన్ బాబు గాయత్రి అన్న పేరు పెట్టారు.

గాయత్రి టైటిల్ , టైటిల్ లోగో లాంచ్ చేసిన వెంటనే మోహన్ బాబు అండ్ కో కి సూపర్ ఫీడ్ బ్యాక్ వచ్చిందట. మదన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మోహన్ బాబు ఓ పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తున్నారు. ఇంకా విశ్లేషం ఏమిటంటే ఇందులో మంచు విష్ణు కూడా ఓ స్పెషల్ రోల్ చేయడం. బ్రహ్మానందం, అనసూయ ఇందులో చేస్తున్న పాత్రలు చాలా బాగుంటాయట. ఇక “పెళ్ళైన కొత్తలో “ దర్శకుడిగా ఇండస్ట్రీ దృష్టిలో మళ్లీ వెనకడుగు వేసిన మదన్ ఈ సినిమాని ఓ ఛాలెంజ్ లా తీసుకుని చేస్తున్నట్టు తెలుస్తోంది.మొత్తానికి ఫిబ్రవరి 9 రిలీజ్ కాబోయే గాయత్రి టైటిల్ సినిమా టైటిల్ చూసిన వాళ్ళు మాత్రం వెంకీ రూట్ లోకి మోహన్ బాబు వచ్చాడని సరదాగా కామెంట్ చేస్తున్నారు.