బాలయ్యను దువ్వుతున్నాడు

VV Vinayak next movie plan with Balakrishna

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
అఖిల్‌తో ‘అఖిల్‌’ చిత్రాన్ని తెరకెక్కించి భారీ డిజాస్టర్‌ను చవిచూసిన దర్శకుడు వివి వినాయక్‌కు మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం దక్కింది. ఆ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను సాధించింది. టాలీవుడ్‌ రికార్డులను బ్రేక్‌ చేసింది. అయినా కూడా వినాయక్‌కు పెద్దగా పేరు రాలేదు. అయినా కూడా వినాయక్‌కు ఉన్న క్రేజ్‌తో యువ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఆయనతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపించి ‘ఇంటిలిజెంట్‌’ చిత్రాన్ని చేసేందుకు ముందుకు వచ్చాడు. ఇటీవలే విడుదలైన ‘ఇంటిలిజెంట్‌’ చిత్రం మరో డిజాస్టర్‌ను వినాయక్‌ ఖాతాలో చేరేలా చేసింది. దాంతో ఇప్పుడు వినాయక్‌ దర్శకత్వంలో నటించేందుకు ఏ హీరో కూడా ఆసక్తి చూపించడం లేదు. వినాయక్‌ ప్రస్తుతం హీరోకు వల వేసే పనిలో ఉన్నాడు.

‘ఇంటిలిజెంట్‌’ చిత్రం తర్వాత వెంటనే ఒక యువ హీరోతో సినిమా చేయాలని వినాయక్‌ భావించాడు. కాని ఇంటిలిజెంట్‌ ఫలితం తారుమారు అవ్వడంతో ఆ యువ హీరో బిజీ అంటూ సైడ్‌ అయ్యాడు. దాంతో వినాయక్‌ ప్రస్తుతం బాలయ్యను దువ్వే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. బాలకృష్ణతో జైసింహా చిత్రాన్ని నిర్మించిన సి కళ్యాణ్‌ మరో సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే బాలయ్య డేట్లు సి కళ్యాణ్‌ చేతిలో ఉన్నాయి. సి కళ్యాణ్‌ నిర్మించబోతున్న సినిమాకు వినాయక్‌ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. గతంలో బాలయ్యకు సూపర్‌ హిట్‌ను వినాయక్‌ అందించాడు. ఆ విశ్వాసంతో ఖచ్చితంగా బాలయ్య, వినాయక్‌కు ఓకే చెప్తాడని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. బాలయ్య ఎన్టీఆర్‌ చిత్రాన్ని చేసే పనిలో ఉన్నాడు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ పూర్తి అయిన తర్వాత వినాయక్‌తో సినిమా చేస్తాడేమో చూడాలి.