బ్యాన్ అవుతున్న వాట్సాప్ ఖాతాలు

బ్యాన్ అవుతున్న వాట్సాప్ ఖాతాలు

లక్షల సంఖ్యలో వాట్సాప్ ఖాతాలు బ్యాన్ అవుతున్నాయి. నిబంధనలు అతిక్రమించిన వారి అకౌంట్లను వాట్సాప్ నిషేధిస్తోంది. గత సంవత్సరం నవంబర్‌లో ఏకంగా భారత్‌కు చెందిన 17,59,000 అకౌంట్లను వాట్సాప్ బ్యాన్ చేసింది. ఐటీ నిబంధనలు 2021ను ఉల్లంఘించిన కారణంగా అకౌంట్లను నిలిపివేసినట్టు ప్రకటించింది. ప్లాట్‌ఫామ్‌ను సురక్షితంగా ఉంచేందుకు.. నిబంధలను అతిక్రమించే వారిని గుర్తించేందుకు డేటా సైంటిస్టులు, నిపుణులతో వాట్సాప్ అధునాతన టెక్నాలజీని వాడుతోంది. రూల్స్ ఉల్లంఘించిన వారి ఖాతాలను బ్యాన్ చేస్తోంది. అయితే వాట్సాప్ అకౌంట్లను ఎందుకు బ్యాన్ చేస్తోంది.. ఖాతా నిషేధానికి గురయ్యేందుకు కారణాలేంటంటే.. వాట్సాప్‌లో చూయకూడని పనులేంటో చూడండి..

వేరే వ్యక్తుల పేర్లతో WhatsApp వాడుతున్నట్టు గుర్తిస్తే ఖాతా నిషేధానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇలా వేరే వారి పేర్లతో అకౌంట్ సృష్టించినట్టు తెలిస్తే వాట్సాప్ బ్యాన్ విధిస్తోంది.కాంటాక్టు లిస్ట్‌లో నంబర్ సేవ్‌ లేకున్నా.. ఆ నంబర్‌కే తరచూ వందలాదిగా అత్యధిక మెసేజ్‌లు చేస్తే వాట్సాప్ అనుమానాస్పద అకౌంట్‌గా గుర్తిస్తోంది. ఆటో మెసేజింగ్, బల్క్ మెసేజింగ్, ఆటో డయలింగ్ లాంటి నిబంధనలకు విరుద్ధమైన చర్యగా భావించి అకౌంట్ బ్యాన్ చేసే అవకాశం ఉంటుంది.

ఎప్పుడైనా అధికారిక వాట్సాప్ యాప్‌నే వినియోగించాలి. ఎక్కువ ఫీచర్లు అంటాయని వాట్సాప్ డెల్టా , GBWhatsApp లాంటి థర్డ్ పార్టీ యాప్స్ వాడితే ఖాతా నిషేధానికి గురయ్యే ఛాన్స్ ఉంటుంది.ఏదైనా వాట్సాప్ ఖాతాను ఎక్కువ మంది బ్లాక్ చేసినా అలాంటి అకౌంట్ నిషేధం అవకాశాలు ఉంటాయి. ఎక్కువ మంది బ్లాక్ చేసిన అకౌంట్‌ను పరిశీలించి.. వాట్సాప్ బ్యాన్ చేసే ప్రమాదం ఉంటుంది.

మాల్‌వేర్ ఉన్న కలిగి ఉన్న ఏపీకే ఫైల్స్‌ను సెండ్ చేసినా.. పిషింగ్ లింక్‌లను పంపినా అలాంటి అకౌంట్లను వాట్సాప్ నిషేధించే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి ఫైల్స్‌ను సెండ్ చేయకూడదు.హింసను, విద్వేషాలను ప్రేరేపించే విధంగా ఉన్న ఫేక్ మెసేజ్‌లు, వీడియోలు సెండ్ చేసినా.. ఫార్వార్డ్ చేసినా వాట్సాప్ అకౌంట్ బ్యాన్‌కు గురి కావొచ్చు. అందుకే ఫేక్ మెసేజ్‌లు, వీడియోల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ అలాంటివి ఎవరికీ సెండ్ చేయకూడదు.