“జై హనుమాన్” అప్డేట్ ని ఎందుకు స్కిప్ చేసారు ?

Why did you skip the
Why did you skip the "Jai Hanuman" update?

టాలీవుడ్ మొదటి సెన్సేషనల్ హిట్ సూపర్ హిట్ మూవీ “హను మాన్” అని తెలిసిందే. యంగ్ హీరో తేజ సజ్జ అలాగే టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ భారీ వసూళ్లతో పాన్ ఇండియా మార్కెట్ లో మంచి గుర్తింపు ని తెచ్చుకుంది. అయితే ఈ మూవీ కి సీక్వెల్ గా “జై హనుమాన్” ని మేకర్స్ అనౌన్స్ చేయడంతో దీనికోసం ఎదురు చూసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.

మరి ఈ మూవీ అప్డేట్స్ కూడా అతి త్వరలోనే వస్తాయి అని ప్రశాంత్ వర్మ కూడా ప్రామిస్ చేసాడు. దానికి తోడు ఈ ఉగాది కానుకగా మూవీ ఫస్ట్ లుక్ ఉండొచ్చు అని చాలా మంది ఎదురు చూసారు. వీటికి అనుగుణంగా తేజ సజ్జ, ప్రశాంత్ వర్మలు ఉగాది, ఏప్రిల్ అంటూ హింట్స్ ఇవ్వడం ఇప్పుడు మరింత ఆసక్తిగా మారింది.

Why did you skip the "Jai Hanuman" update?
Why did you skip the “Jai Hanuman” update?

దానికి తోడు పైగా హనుమంతునికి ప్రీతికరమైన రోజు మంగళవారం నాడు “హను మాన్” ఒకో అప్డేట్ ని అప్పుడు ఇవ్వడం ఇప్పుడు ఉగాది కూడా మంగళవారం రావడంతో సెంటిమెంట్ గా జై హనుమాన్ అప్డేట్ పట్ల మరింత బలమైన సంకేతాలు చూపించాయి. కానీ ఫైనల్ గా వారు ఇచ్చిన హింట్స్ కు తగ్గట్టుగా ఎలాంటి అప్డేట్స్ రాలేదు. మరి దీనితో ఇద్దామనుకొని స్కిప్ చేసారా లేక వేరే కారణం ఉందా అనేది వాళ్ళకే తెలియాలి. మొత్తానికి మాత్రం జై హనుమాన్ అప్డేట్ ను ఆశించినవారు మాత్రం ఈ ఉగాదికి కాస్త డిజప్పాయింట్ అయ్యారు.