‘పుష్ప’ తో అల్లు అర్జున్ చరిత్ర సృష్టించనున్నాడా? నేషనల్ అవార్డు కోసం అభిమానుల ప్రార్థనలు..?

Allu Arjun
Allu Arjun

69 వ జాతీయ సినిమా అవార్డులు ఎవరెవరికి ఇస్తున్నారో ఇంకొన్ని గంటల్లో బయటి రాబోతున్నాయి జ్యూరీ ఈరోజు సాయంత్రం అయిదు గంటలకి ఢిల్లీ లో జాతీయ అవార్డులు ప్రకటించనున్నారు. అయితే ఈ సరి అవార్డుల విజేతలో గట్టిగ పోటీ ఉందని మాత్రం తెలుస్తోంది. ఎందుకంటే చాలా మంచి సినిమాలు గత సంవత్సరం విడుదలయ్యేయి,

అందులో అల్లు అర్జున్ నటించిన తెలుగు సినిమా ‘పుష్ప’ కూడా వుంది. ఈ సినిమాకి దర్శకుడు సుకుమార్. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన తన కెరిర్ లో బెస్ట్ ఇచ్చాడని అందరూ ప్రశంసించారు.ఆ సినిమా తెలుగు సినిమా జయపతాకాన్ని ప్రపంచం అంతటా చాటి చెప్పింది.అందరికీ అర్థం అవుతుంది. ఇక అందులో నటించిన అల్లు అర్జున్ ఈసారి జాతీయ ఉత్తమ నటుడుకి ఎంపికయ్యే సూచనలు వున్నాయి అని అనిపిస్తోంది.

తాజా చమాచారం ప్రకారం. అల్లు అర్జున్ వేపే చాల మాది ముగ్గు చూపినట్టుగా కూడా తెలిసింది. తెలుగు సినిమాలో నటించిన ఇతర బాషా నటులు కమల్ హాసన్ లాంటివాళ్ళకి వచ్చింది కానీ, తెలుగు నటుడికి మాత్రం ఇంతవరకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రాలేదు. ఈసారి అల్లు అర్జున్ కి వస్తుంది అని అతని అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు, అతనికి వస్తే తెలుగు ప్రజలందరూ సంబరాలు చేసుకునే సమయం ఆసన్నమైనట్టే !