50 ఏళ్ల వయసు పైబడిన వారిలో శరీరం తక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తుంది. అంతేకాకుండా వృద్ధాప్యంలో కీళ్ల నొప్పులు ప్రారంభమవుతాయి. దాంతో అనారోగ్య సమస్యలు దరిచేరతాయి. ఎక్కువగా హైబీపీ, గుండె జబ్బులు, డయాబెటిస్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తుంటాయి. ప్రతి మనిషి 50 ఏళ్ల వయసు దాటిన తర్వాత వారి శరీరం తిరిగి శక్తిని పొందడానికి తప్పనిసరిగా కొన్ని యోగా ఆసనాలు పాటించాలి.ఎలాంటి అనారోగ్యాన్నైనా, మానసిక సమస్యనైనా దూరం చేసే శక్తి యోగాకు ఉందనడం అతిశయోక్తి కాదు.
అందుకే చాలామంది తాము చేసే రోజువారీ వ్యాయామాల్లో భాగంగా యోగాను చేర్చుకుంటుంటారు. అయితే ఇందులోనూ ఎన్నో యోగా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.ఈ భంగిమలో రెండు చేతులను భూమికి నిటారుగా ఆనించాలి. చేతుల సాయంతో బాడీ మొత్తాన్ని పైకి లేపాలి. ఈ యోగా భంగిమ శరీరం వెనుక భాగంలోని ముఖ్య కండరాలను బలపరుస్తుంది. అంతేకాకుండా శరీరం ముందు భాగంలో బిగుతుగా ఉండే కండరాలను లూజ్ చేయడానికి, సాగదీయడానికి సహాయపడుతుంది.
ఈ భంగిమ ఛాతీ ప్రాంతాన్ని బిగుతుగా ఉంచుతుంది. ఈ భంగిమలో చేతులు నిటారుగా పైకి ఎత్తాలి. పొట్ట పైభాగం నుంచి తల వరకు పక్కకు వంగి ఉంటుంది. ఈ భంగిమలో ముఖం కూడా నిటారుగా ఉండదు.ఈ భంగిమలో రెండు చేతులను ముందుకు ఉంచి నమస్కారం పెడుతున్నట్లు చూపించాలి. అనంతరం రెండు కాళ్లను దూరంగా ఉంచాలి. ఇప్పుడు మనం ఇండియన్ స్టైల్ వాష్ రూంలో కూర్చున్న తరహాలో భంగిమ పెట్టాలి.
ఇలాంటి యోగా భంగిమ మీ కండరాలను దృఢంగా చేస్తుంది. రోజువారీ కార్యకలాపాలలో భాగంగా మీరు ఎక్కువ గంటలు కూర్చొని ఉంటే యోగి స్క్వాట్ భంగిమను చేయడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది.పిరమిడ్ పోజ్ భంగిమలో రెండు కాళ్లను పక్క పక్కనే ఉంచాలి. అనంతరం మీ కుడి కాలును జానెడు దూరం ముందుకు జరపాలి. ఇప్పుడు పొట్ట పైభాగాన్ని వంచాలి. రెండు చేతులు నేళ్లకు ఆనేలా భంగిమ పెట్టాలి. ఈ భంగిమ కారణంగా మీ చేతి కండరాలు, కాలి కండరాలు దృఢంగా అవుతాయి. మీ శరీర బరువును బ్యాలెన్స్ చేయడానికి ఇది ఒక సులభమైన మార్గం.
ఇవే కాకుండా వయసు మళ్లిన వారు లాఫ్టర్ యోగా థెరపీని కూడా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది నవ్వుతూ చేసే ఓ సరదా యోగా పద్ధతి అని పేరులోనే తెలిసిపోతుంది. ఈ యోగా ఫన్ మాత్రమే కాదు.. ఎంతో ఆరోగ్యాన్ని సైతం అందిస్తుందని నిపుణులు చెప్తున్నారు.లాఫింగ్ థెరపీని ఆధారంగా చేసుకొని 1995లో ఈ లాఫ్టర్ యోగా పద్ధతిని పరిశోధకులు అందుబాటులోకి తీసుకొచ్చారు. పేరుకు తగినట్లుగానే నవ్వుతూ వివిధ యోగాసనాలు చేయడమే దీని ముఖ్య ఉద్దేశం.
కొంతమంది వ్యక్తులు ఒక బృందంగా ఏర్పడి లేదంటే వర్క్‌షాపుల్లో లేదా శిక్షణ తరగతుల్లో ఇన్స్ట్రక్టర్ చెప్పినట్లు ఉద్దేశపూర్వకంగా నవ్వుతూ సరదాగా కొన్ని ఆసనాలు చేయాల్సి ఉంటుంది. చాలా వరకు ఇలాంటి యోగా సెషన్స్ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ, ‘హొ-హొ’ లేదా ‘హ-హ-హ’ అనే శబ్దం వచ్చేలా నవ్వుతూనే ప్రారంభమవుతాయి. ఆ తర్వాత నెమ్మదిగా వివిధ రకాల యోగాసనాలు, శ్వాస సంబంధిత వ్యాయామాలు, ధ్యానం.. వంటివి నేర్పిస్తారు. అయితే ఇది సరదాగా చేసే యోగా ప్రక్రియే అయినప్పటికీ సొంతంగా కాకుండా నిపుణుల సలహా మేరకు చేస్తే చక్కటి ఫలితం ఉంటుందంటున్నారు.. అలాగే ఆసనాల వల్ల శరీరంపై గాయాలు కాకుండా జాగ్రత్తపడచ్చు.ఒత్తిడి తగ్గుతుంది.. ఇమ్యూనిటీ పెరుగుతుంది.
నవ్వుతూ యోగా చేయడం వల్ల ఒత్తిడిని కలిగించే హార్మోన్లు తగ్గి, రోగనిరోధక కణాలు పెరుగుతాయి.లాఫింగ్ థెరపీతో లింఫోసైట్స్ కూడా ఎక్కువవుతాయి. తద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇన్ఫెక్షన్లతో పోరాడే యాంటీబాడీలు శరీరంలో విడుదలవుతాయి.ఈ యోగాతో రోగనిరోధక వ్యవస్థ పనితీరు సుమారు 40 శాతం పెరుగుతుందని ఓ అధ్యయనంలో కూడా తేలింది. లాఫ్టర్ యోగా వల్ల శరీరంలో ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ స్థాయుల ఉత్పత్తి తగ్గి, డోపమైన్, సెరటోనిన్.. వంటి హ్యాపీ హార్మోన్ స్థాయులు ఎక్కువగా విడుదలవుతాయి. ఫలితంగా ఒత్తిడి, ఆందోళనలు తగ్గి మానసిక ప్రశాంతత సొంతమవుతుంది. అంతేకాదు.. బీపీ కూడా అదుపులోకి వస్తుంది.