అన్సారీలో కాంగ్రెస్ రక్తం ప్రవహిస్తోంది

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిగా పదవీకాలం పూర్తిచేసుకున్నవాళ్లు.. చాలా హుందాగా వీడ్కోలు ప్రసంగం చేస్తారు. ఎలాగో తర్వాత రాజకీయ ఆశలు పెద్దగా ఉండవు కాబట్టి అనవసర వివాదాల జోలికి పోకుండా దేశభక్తి కోణంలో స్పీచ్ లు ఇవ్వడం సర్వసాధారణం. మొన్న రాష్ట్రపతిగా గుడ్ బై చెప్పిన ప్రణబ్ అదే చేశారు. కానీ ఉఫరాష్ట్రపతిగా వీడ్కోలు చెప్పిన అన్సారీ మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అన్సారీ వయసు ఎనభై ఏళ్లు. ఇకపై ఆయన్ను పదవులు వరించే ఛాన్స్ లేదు. ఎంత కాంగ్రెస్ భజన చేసినా ఏమీ రాదు. అయినా సరే పనిగట్టుకుని దేశంలో మైనార్టీలు అభద్రతా భావంతో ఉన్నారని చెప్పడాన్ని మాత్రం ఎవ్వరూ మెచ్చుకోలేకపోతున్నారు. ముస్లిం దేశాల నుంచి మన దేశానికి వలసలు వస్తున్న తరుణంలో.. అన్సారీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పటిదాకా ఆయన నిర్వహించిన పదవి గౌరవానికే భంగం కలిగించింది.

అన్సారీది కాంగ్రెస్ కుటుంబమని తెలిసినా.. మోడీ సర్కారు ఆయన్ను గౌరవించింది. కానీ ఆ గౌరవాన్ని ప్రణబ్ నిలబెట్టుకున్నారు కానీ అన్సారీ పోగొట్టుకున్నారు. దేశానికి ద్వితీయ పౌరుడిగా ఏదైతే మాట్లాడకూడదో అదే మాట్లాడారు. పదేళ్లుగా ఉపరాష్ట్రపతిగా ఉన్న అన్సారీ చాలా మంది విదేశీ దౌత్యవేత్తలతో భేటీ అయ్యారు. వారి దగ్గర ఇంతకంటే దారుణమైన వ్యాఖ్యలే చేసి ఉంటారనే అనుమానాలు వస్తున్నాయి.

మరిన్ని వార్తలు:

ప్ర‌చార‌మూ…ప్ర‌లోభ‌మూ

ఆత్మాహుతి దాడి కేసు కొట్టివేత

ఐక్యంగా అన్నాడీఎంకే …చిన్నమ్మ వర్గం బలి.