నేను ఈ మూవీ నుంచి తప్పించుకోవాలనుకున్న – జాన్వీకపూర్‌

I wanted to escape from this movie - Janhvi Kapoor
I wanted to escape from this movie - Janhvi Kapoor

హీరోయిన్ జాన్వీకపూర్‌ ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’తో ప్రేక్షకులని పలకరించేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలో ఈ మూవీ షూటింగ్‌ విశేషాలని తాజాగా జాన్వీ పంచుకుంది. ఈ మూవీ కోసం తాను ఎంతో కష్టపడినట్లు జాన్వీ చెప్పుకొచ్చింది. జాన్వీ కపూర్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఈ మూవీ కోసం ‘మిలీ’ మూవీ షూటింగ్‌ సమయంలోనే శిక్షణ తీసుకున్నాను. ఐతే, పూర్తిగా నేర్చుకోవడానికి రెండేళ్లు పట్టింది. నా కోచ్‌ లు నన్ను పూర్తి క్రికెటర్‌గా మార్చడానికి చాలా కష్టపడ్డారు.

I wanted to escape from this movie - Janhvi Kapoor
I wanted to escape from this movie – Janhvi Kapoor

ఐతే, ఈ మూవీ చిత్రీకరణ సమయంలో నాకు ఎన్నో గాయాలయ్యాయి. ఒక దశలో అయితే, నా రెండు భుజాలు పనిచెయ్యవేమో అనుకున్నాను. ఆ సమయంలోనే ఎన్నోసార్లు ఈ మూవీ నుంచి నేను వైదొలగాలని భావించాను. కానీ, ఈ చిత్ర యూనిట్ నాకు ధైర్యం చెప్పారు. నన్ను ముందుకి నడిపారు’ అని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది.