Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమెరికా న్యూయార్క్ సిటీ ల్యాండ్ మార్క్ అంటే అందరికీ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గుర్తొస్తుంది. ప్యారిస్ అనగానే ఈఫిల్ టవర్.. లండన్ అనగానే బిగ్ బెన్ గడియారం గుర్తొస్తాయి. అదే స్టైల్లో హైదరాబాద్ కు చార్మినార్ ఉంది. బుద్ధ విగ్రహం కూడా ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా స్టాచ్యూ ఆఫ్ లిబరేషన్ పెడతామని బీజేపీ ప్రపోజ్ చేస్తోంది.
నిజాం వ్యతిరేక పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన యోధులకు అదే నివాళి అంటోంది కాషాయ పార్టీ. విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతామని, ఆ దమ్ము తమకే ఉందని తెలంగాణ వ్యాప్తంగా యాత్ర చేస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ లిబరేషన్ ప్రకటన చేయడం టీఆర్ఎస్ లో కలకలం రేపుతోంది. లక్ష్మణ్ ప్రకటనలు చూస్తుంటే.. ఉద్యమ సెంటిమెంట్ ను తమ నుంచి లాగేసుకుంటారనే డౌటొస్తోందని నేతలు కేసీఆర్ దగ్గర మొరపెట్టుకుంటున్నారట.
ఓసారి యాత్రకు పర్మిషన్ ఇచ్చాక మధ్యలో అరెస్టులు చేస్తే అది సున్నిత సమస్యగా మారి ప్రభుత్వం మెడకే చుట్టుకుంటుంది. ఉన్నట్లుండి లక్ష్మణ్ స్టాచ్యూ ఆఫ్ లిబరేషన్ ప్రకటన వెనుక అమిత్ షా ఐడియా ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. నిజానికి క్షేత్రస్థాయిలో సరైన క్యాడర్ లేకుండా సెంటిమెంట్ తో సీఎం అయిన కేసీఆర్.. అదే సెంటిమెంట్ తో బీజేపీ బాగుపడుతుందేమోనని భయపడుతున్నారు.
మరిన్ని వార్తలు: