సీపీఎం రూల్స్ ఇలాగే ఉంటాయ్

CPM Party MP Ritha Bratha Benarji Suspended From Part

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, కార్యకర్త అయినా వామపక్ష సిద్ధాంతాలు పాటించాల్సిందే. ఈ విషయంలో సీపీఎంలో అస్సలు రాజీ ఉండదు. సీపీఎం ఎంపీలు, ఎమ్మెల్యేలు తమకు లక్షల రూపాయల జీతం వస్తున్నా.. అదంతా పార్టీ ఫండ్ కు ఇచ్చేసి.. తాము మాత్రం పార్టీ ఇచ్చే శాలరీతో జీవనం సాగిస్తుంటారు. అలా అయితేనే కార్యకర్తలకు ఆదర్శంగా ఉండగలమని చెబుతుంటారు.

గతంలో ఉమ్మడి ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న రాఘవులు.. ఎప్పుడూ సింపుల్ లుక్ తోనే కనిపించేవాళ్లు. ఆయనకు పార్టీలో హోదా పెరిగినా.. ఆయన లుక్ మాత్రం మారిందే లేదు. కానీ నేటి తరం ఎంపీలు మాత్రం కాస్త లైన్ దాటేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సీపీఎంకు ఎంపీలెవరూ లేకపోయినా.. బెంగాల్ నుంచి ఎంపీలున్నారు. వారిలో రాజ్యసభ సభ్యుడు రితబ్రత గీత దాటడంతో.. ఆయనపై వేటు పడింది.

బెంగాల్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న రితబ్రత బెనర్జీ.. విద్యార్థి నేతగా రాజకీయాలు మొదలెట్టి.. ఇప్పుడు ఎంపీగా ఎదిగారు. అయితే యూత్ లో ఉన్న సదరు ఎంపీ తన చపలత్వాన్ని మాత్రం దాచుకోలేకపోయారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న రితబ్రత… ఖరీదైన పెన్, వాచ్ ను ధరించిన ఫోటో పోస్ట్ చేయడం వైరల్ గా మారింది. ఓ కార్యకర్త అబ్జెక్షన్ చెప్పడంతో… సీపీఎం సీరియస్సై సదరు ఎంపీని మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది.

మరిన్ని వార్తలు

రోజా కోసం కొత్త బాణం సిద్ధం

కిమ్ పై ట్రంప్ కొత్త అస్త్రం