అనంత పంచాయితీ సెట్ చేసిన బాబు

chandrababu-solved-zp-chairman-issue-in-anantapur-zilla-parishad

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అనంతపురం జడ్పీ ఛైర్మన్ పదవిపై నెలకొన్న వివాదానికి టీడీపీ అధినేత చంద్రబాబు తెరదించారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో సీరియస్ గా ఉండే.. ఇటీవలి ఉపఎన్నికల హడావిడిలో ఈ ఇష్యూ సెటిల్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ఎన్నికలు ముగియగానే.. హుటాహుటిన అనంత డీల్ సెట్ చేయడంపై క్యాడర్లో హర్షం వ్యక్తమవుతోంది. దివంగత నేత పరిటాల అనుచరుడు చమన్ బాబు ఆదేశాల్ని బేఖాతరు చేయడంతో గొడవ మొదలైంది.

గతంలో జడ్పీ ఎన్నికలు జరిగినప్పుడు పూల నాగరాజు, చమన్ మధ్య పోటీ ఏర్పడింది. దీంతో మొదట జడ్పీటీసీల్ని గెలిపించుకోవడంపై దృష్టి పెట్టాలని చంద్రబాబు సూచించారు. దీంతో ఇద్దరూ కలిసి పనిచేయడంతో… అత్యధిక సీట్లు టీడీపీ గెలుచుకుంది. జడ్పీ ఛైర్మన్ పంచాయితీ మళ్లీ షురూ అయింది. దీంతో ఇద్దరూ చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలని బాబు సూచించారు.

మొదటి విడతలో పీఠమెక్కిన చమన్.. తన పదవీకాలం పూర్తైనా దిగడానికి నిరాకరించారు. అప్పుడు పూల నాగరాజు చంద్రబాబును ఆశ్రయించారు. చంద్రబాబు హెచ్చరించినా చమన్ మారలేదు. ఓ దశలో చమన్ కు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని చంద్రబాబు.. రాజీనామా చేశాకే తనకు కనిపించాలని ముఖం మీదే చెప్పేశారు. ఇప్పుడు జలసిరికి హారతిలో భాగంగా అనంత వెళ్లిన బాబు.. చమన్ ను రాజీనామాకు ఒప్పించారు. ఆయన రాజీనామా చేయగానే.. అర్బన్ డెవలప్ మెంట్ అథార్టీ ఛైర్మన్ గా నియమించే ఛాన్స్ కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు:

టి.టి.డి కొత్త చైర్మన్… ఎవరంటే ?

లండ‌న్ వెళ్ల‌నున్న జ‌గ‌న్‌… డిశ్చార్జి పిటిషన్ పై విచార‌ణ వాయిదా

ఎవరు ఆ ఆరుగురు… వైసీపీ లో కాక.