నేటి నుంచి తూర్పు గోదావరి జిల్లాలో పవన్‌ సభలు ప్రారంభం …!

Pawan sabhas will start in East Godavari district from today...!
Pawan sabhas will start in East Godavari district from today...!

ఈ నేపథ్యంలోనే ఇవాళ్టి నుంచి 3 రోజులు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పవన్‌ సభలు ఉండబోతున్నాయి . మూడు రోజుల్లో 6 నియోజకవర్గాల్లో పవన్‌ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు . ఈరోజు సాయంత్రం కోనసీమ జిల్లా రాజోలు, రామచంద్రపురం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రేపు కాకినాడ జిల్లా పెద్దాపురం, కాకినాడ గ్రామీణంలో పవన్‌ పర్యటన ఉంటుందని జనసేన వర్గాలు తెలియచేశాయి . ఈ నెల 28న ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాల్లో పవన్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు చెప్పారు.

Pawan sabhas will start in East Godavari district from today...!
Pawan sabhas will start in East Godavari district from today…!

ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి నేతల ప్రచారం ఊపందుకున్నది . ఓవైపు కాంగ్రెస్పై మరోవైపు వైఎస్సార్సీపీపై విమర్శలు కురిపిస్తూ ప్రచారంలో ఈ నేతలు జోరు సాగిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ ని టార్గెట్ చేసుకుని విమర్శలు కుప్పిస్తున్నారు. ఈ ఐదేళ్లలో జగన్ ఇచ్చిన హామీల అమలును ప్రశ్నిస్తున్నారు. ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసిన జనసేనాని.. ఇక వరుస బహిరంగ సభలలో బిజీ కానున్నారు.