ఓటిటి ప్లాట్ ఫామ్ లో “ఓ మై గాడ్ 2”మూవీ తెలుగు వెర్షన్ ……

"Oh My God 2" Movie Telugu Version on OTT Platform......
"Oh My God 2" Movie Telugu Version on OTT Platform......

గత ఏడాది బాలీవుడ్ (Bollywood Cinema) డెలివర్ చేసిన పలు హిట్ మూవీ ల్లో స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akashay Kumar) అలాగే వెర్సటైల్ నటుడు పంకజ్ త్రిపాఠి నటించిన మూవీ “ఓ మై గాడ్ 2” కూడా ఒకటి. మరి దీనికి మొదటి భాగాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్, వెంకీ మామ లు “గోపాల గోపాల” లాగా రీమేక్ చేశారు.

"Oh My God 2" Movie Telugu Version on OTT Platform......

“Oh My God 2” Movie Telugu Version on OTT Platform……

అయితే హిందీలో చాన్నాళ్ళకు సీక్వెల్ గా దర్శకుడు అమిత్ రాయ్ తెరకెక్కించిన ఈ మూవీ మంచి వసూళ్లు సాధించి హిట్ అయ్యింది. అయితే వసూళ్లు హిట్ అనే వాటికంటే ఈ మూవీ ద్వారా మేకర్స్ ఇచ్చిన సందేశానికి ఎక్కువ ప్రశంసలు వచ్చాయి. దీనితో ఓటిటిలో చాలా మంది చూద్దాం అని అనుకున్నారు.

కానీ నెట్ ఫ్లిక్స్ లో కేవలం ఒరిజినల్ హిందీలో మాత్రమే అందుబాటులోకు వచ్చింది. అయితే ఇప్పుడు ఫైనల్ గా రీజనల్ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. మరి తెలుగు సహా మరాఠి, తమిళ్ మరియు బంగ్లా భాషల్లో జియో సినిమా లో అయితే ఈ మూవీ ఇప్పుడు అందుబాటులోకు వచ్చింది. మరి ఈ మూవీ ని చూడాలి అనుకునే వారు తప్పకుండా జియో సినిమాలో ట్రై చేయవచ్చు.