కొత్త మూవీ “విశ్వంభర”లో త్రిష సరికొత్త లుక్ పోస్టర్…!

Trisha new look poster in new movie "Vishwambhara"...!
Trisha new look poster in new movie "Vishwambhara"...!

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా త్రిష కృష్ణన్ హీరోయిన్ గా ఎన్నో ఏళ్ల తర్వాత తమ కలయికలో చేస్తున్న భారీ మూవీ నే “విశ్వంభర”. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ మూవీ మళ్ళీ ఎన్నో ఏళ్ల తర్వాత చిరు నుంచి భారీ ఫాంటసీ థ్రిల్లర్ గా వస్తుండగా ఈ మూవీ నుంచి మేకర్స్ ఒక స్పెషల్ అప్డేట్ ను అందించారు.

ఈరోజు త్రిష పుట్టినరోజు కానుకగా అయితే ఒక బ్యూటిఫుల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రివీల్ చేసిన ఈ పోస్టర్ లో త్రిష లుక్ మాత్రం చాలా అద్భుతం గా అనిపించేలా ఉందని చెప్పాలి. ఆమె కాస్ట్యూమ్ కానీ మెడలో నగ దానికి తోడు త్రిష అందం ఈ పోస్టర్ ను బాగా హైలైట్ గా చేసాయి.

Trisha new look poster in new movie "Vishwambhara"...!
Trisha new look poster in new movie “Vishwambhara”…!

ఇక బ్యాక్గ్రౌండ్ లో మూవీ మార్క్ పంచభూతాల నక్షత్రం డిజైన్ తో చూసినవెంటనే అబ్బురపరిచేలా అనిపిస్తుంది. అలాగే దీనితో త్రిష పాత్ర మూవీ లో చాలా ప్రత్యేకంగా కనిపించేలా ఉందని చెప్పవచ్చు. మొత్తానికి అయితే మేకర్స్ త్రిష అభిమానులకు ఒక ట్రీట్ లాంటి పోస్టర్ ను అందించారు అని చెప్పాలి.