మరోసారి యాక్షన్ లోకి వస్తున్న “విశ్వంభర”.?

"Vishwambhara" coming into action once again?
"Vishwambhara" coming into action once again?

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ట కాంబినేషన్ లో చేస్తున్న భారీ మూవీ విశ్వంభర కోసం మెగా ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ అవుతోంది . ఇక ఈ మూవీ రీసెంట్ గానే ఒక సాంగ్ షూట్ ను కంప్లీట్ చేసుకోగా ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ పై అయితే లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. దీని ప్రకారం మెగాస్టార్ మరోసారి యాక్షన్ లోకి దిగబోతున్నారని తెలుస్తోంది .

"Vishwambhara" coming into action once again?
“Vishwambhara” coming into action once again?

ఆల్రెడీ మేకర్స్ ఒక భారీ పోరాట సన్నివేశాన్ని కంప్లీట్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. దాని తర్వాత సాంగ్ ను కంప్లీట్ చేశారు. ఇప్పుడు మరోసారి యాక్షన్ సీక్వెన్స్ ను ఈ రానున్న కొన్ని రోజుల్లో స్టార్ట్ చేయనున్నారంట . మొత్తానికి అయితే ఈ ఫాంటసీ వండర్ ను పక్కా ప్లానింగ్ ప్రకారం తీసుకెళ్తున్నారని చెప్పాలి. ఇక ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా త్రిష హీరోయిన్ గా నటిస్తుంది అలాగే యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.