విశ్వంభరకి పోటీగా కాంతార 2 మూవీ ..!

Kantara 2 movie to compete with Vishwambhar ..!
Kantara 2 movie to compete with Vishwambhar ..!

వచ్చే ఏడాది రాబోయే సంక్రాంతి పండుగకు భారీ మూవీ లు విడుదల చేయడానికి ఆయా మూవీ ల నిర్మాతలు సన్నహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నటువంటి మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా విశ్వంభర ఒకటి. ఈ విషయాన్ని ఇప్పటికే ఆ చిత్ర యూనిట్ అధికారికాండ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం మరొక పెద్ద మూవీ కూడా సంక్రాంతికి విడుదల అవడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి . గత ఏడాది భారీ విజయాన్ని అందుకున్నటువంటి కాంతారా మూవీ కి ఫ్రీక్వెలా మరో మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.

Kantara 2 movie to compete with Vishwambhar ..!
Kantara 2 movie to compete with Vishwambhar ..!

కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటించి, తెరకెక్కించిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ విషయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలుసు.డివోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ మూవీ ని కేవలం రూ.16 కోట్లతో తెరకెక్కించగా.. ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది.ఈ మూవీ కు ప్రీక్వెల్ గా వస్తున్న కాంతార చాప్టర్ వన్ మూవీ ని కూడా సంక్రాంతికి విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది .డివోషనల్ కంటెంట్ తో వస్తున్న ఈ రెండు మూవీ లు సంక్రాంతి బరిలో నిలుస్తుండటంతో ఈ రెండిటిలో ఏ మూవీ ప్రేక్షకుల అదరణపొందుతుంది అనే ఉత్కంఠ ఇప్పటినుండే మొదలైయింది.