‘మహేష్ – రాజమౌళి’ మూవీ ల పై లేటెస్ట్ అప్ డేట్…..!

Latest update on 'Mahesh - Rajamouli' movies.....!
Latest update on 'Mahesh - Rajamouli' movies.....!

దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అంటూ మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్ లోనైనా మహేష్ – జక్కన్న మూవీ కి సంబంధించిన అప్ డేట్ చెబుతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఐతే, ఈ మూవీ గురించి తాజాగా ఒక రూమర్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ పూర్తి అయింది అని, ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ పై కసరత్తులు చేస్తున్నారని.. ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ మూవీ కి మాటలు రాస్తున్నారని తెలుస్తోంది. సాయి మాధవ్ బుర్రా ఆర్ఆర్ఆర్ మూవీ కి కూడా మాటలు రాశారు. ఇప్పుడు మహేష్ – రాజమౌళి మూవీ కి కూడా మాటలు రాస్తున్నారు.

Latest update on 'Mahesh - Rajamouli' movies.....!
Latest update on ‘Mahesh – Rajamouli’ movies…..!

కాగా ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఈ కథా నేపథ్యం సాగుతుందని తెలుస్తోంది. ఆ మధ్య విజయేంద్రప్రసాద్‌ ఈ మూవీ కథ గురించి ఒక ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కి పెద్ద అభిమానులం. అందుకే, ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ మూవీ స్క్రిప్ట్ ని రాయాలనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి, రాజమౌళి – మహేష్ మూవీ ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఉండబోతుంది. ఏది ఏమైనా ఈ మూవీ పై రోజురోజుకు అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.