గుడ్ న్యూస్ : “వకీల్ సాబ్” రీరిలీజ్. ఎప్పుడంటే ..!

Good News : “Vakil Saab” Rerelease. When ..!
Good News : “Vakil Saab” Rerelease. When ..!

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మూవీ లకి తాత్కాలికంగా విరామం ఇచ్చి తన రాజకీయ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ గ్యాప్ లో సడెన్ గా పవన్ నటించిన సెన్సేషనల్ కం బ్యాక్ హిట్ మూవీ “వకీల్ సాబ్” మూవీ ని రీ రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా మేకర్స్ ఇవాళ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అయితే ఈ మే 1న రానున్న ఈ మూవీ విషయంలో మెయిన్ గా పవన్ అభిమానులే అంత ఆసక్తిగా లేనట్టు కనిపిస్తుంది.

Good News : “Vakil Saab” Rerelease. When ..!
Good News : “Vakil Saab” Rerelease. When ..!

ప్రస్తుతం పవన్ పొలిటికల్ పరంగా చాలా బిజీగా ఉంటూ తమకి కావాల్సిన కిక్ ఇస్తున్నాడని ఈ మూమెంట్ లో అలానే ఉండాలని ఆశిస్తున్నట్టుగా సోషల్ మీడియాలో తెలుపుతున్నారు. దీనితో ఈ మూవీ రీ రిలీజ్ పట్ల వారు ఏమంత ఆసక్తిగా లేరనే అనిపిస్తుంది. మరి సడెన్ గా అనౌన్స్ చేసిన ఈ రీ రిలీజ్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి. ఇక ఈ మూవీ కి థమన్ సంగీతం అందించగా ఇది బాలీవుడ్ హిట్ మూవీ “పింక్” కి రీమేక్ గా తెరకెక్కింది. అలాగే అనన్య నాగళ్ళ, నివేత థామస్, అంజలి లు ముఖ్య పాత్రల ల్లో నటించారు.