“ది ఫ్యామిలీ స్టార్” ఓటిటి లో లో ఈ సీన్స్ పై ట్రోల్స్..!

Trolls on this scene in
Trolls on this scene in "The Family Star" OTT..!

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన అవైటెడ్ మూవీ “ది ఫ్యామిలీ స్టార్”. మరి మేకర్స్ చాలా నమ్మకం పెట్టుకున్న ఈ మూవీ థియేటర్స్ లో అనుకున్న రేంజ్ రెస్పాన్స్ ను అందుకోలేకపోయింది. అలాగే వసూళ్ల విషయంలో కూడా అంతగా ప్రభావం చూపలేదు.

Trolls on this scene in "The Family Star" OTT..!
Trolls on this scene in “The Family Star” OTT..!

దీనితో విజయ్ కెరీర్ లో హిట్ మరింత దూరం అవ్వగా లేటెస్ట్ గానే ఓటిటిలో ఈ మూవీ (The Family Star in OTT) రిలీజ్ కు వచ్చింది. ప్రైమ్ వీడియోలో రిలీజ్ కు వచ్చిన ఈ మూవీ పై ఇప్పుడు సోషల్ మీడియాలో పలు సీన్స్ విషయంలో ట్రోల్స్ నడుస్తున్నాయి. మొదటిగా రవిబాబుకు విజయ్ దేవరకొండ వార్నింగ్ ఇచ్చే సీక్వెన్స్ బాగా హైలైట్ కాగా నెక్స్ట్ ఇపుడు మూవీ స్టార్టింగ్ లో వచ్చే దోశలు సీన్ కోసం రచ్చ నడుస్తోంది .

ఎంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కూడా అలాంటి దోశలు వేసుకోరని ఈ ఐడియా ఎలా వచ్చిందో అని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే గతంలో ఇదే సీక్వెన్స్ సంబంధించి ట్రైలర్ వచ్చాక కూడా పలు కామెంట్స్ వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. మరి మళ్ళీ అదే సీన్ పై నెగిటివ్ కామెంట్స్ రావడం గమనార్హం. ఇక ఈ మూవీ కు గోపి సుందర్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించారు.