గుడ్ న్యూస్ : “దేవర” ఫియర్ సాంగ్ ప్రోమో వచ్చేసింది ..!

Good news:
Good news: "Devara" fear song promo out!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ దేవర. అక్టోబర్ 10, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ పాన్ ఇండియా సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. మే 19, 2024 న ఫియర్ సాంగ్ ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సాంగ్ కు సంబందించిన ప్రోమో ని రిలీజ్ చేశారు.

Good news: "Devara" fear song promo out!
Good news: “Devara” fear song promo out!

ప్రోమో చాలా చాలా పవర్ ఫుల్ గా సాగింది. పూర్తి సాంగ్ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనిరుద్ రవి చందర్ ఈ సాంగ్ ని వేరే లెవెల్లో కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది . ఈ మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.