ఊటీలో ‘విశ్వంభర’ కొత్త కధ ..!

'Vishwambhara' new story in Ooty..!
'Vishwambhara' new story in Ooty..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట ‘విశ్వంభర’ అనే మూవీ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ లో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. ఐతే, విశ్వంభర టీమ్ ఇటీవల హైదరాబాద్‌లో ఒక పాటతో పాటు థ్రిల్లింగ్ ఫైట్ సీక్వెన్స్ ను షూట్ చేశారు. ప్రస్తుతం తదుపరి షెడ్యూల్ కోసం విశ్వంభర టీమ్ ఊటీలో ఉన్నది తాజాగా దర్శకుడు వశిష్ట ఊటీలో చలిమంట ముందు కూర్చున్న ఫోటో ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

'Vishwambhara' new story in Ooty..!
‘Vishwambhara’ new story in Ooty..!

కాగా ఊటీలో ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌ లో ‘త్రిష – చిరు’ల పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారంట . ఈ మూవీ లో మెగాస్టార్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో.. ఆయన పాత్ర అలాగే ఉంటుందట. అలాగే, ఈ మూవీ లో అద్భుతమైన ఫాంటసీ డ్రామా కూడా ఉంటుందట. UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ విశ్వంభర మూవీ కు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ జనవరి 10, 2025న విడుదల కాబోతుంది.