టాక్..”లియో” కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందా ..?

Talk.."Leo" combination will be repeated once again ..?
Talk.."Leo" combination will be repeated once again ..?

కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) అలాగే ఇళయ దళపతి విజయ్ జోసెఫ్  కాంబినేషన్ లో వచ్చిన రెండో మూవీ “లియో” కోసం అందరికీ తెలిసిందే. మరి వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లతో అదరగొట్టిన ఈ మూవీ కోలీవుడ్ నుంచి హైయెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. అయితే ఈ మూవీ లో విజయ్ సరసన త్రిష ఎన్నో ఏళ్ల తర్వాత హీరోయిన్ గా నటించిన సంగతి అందరికి తెలిసిందే.

Talk.."Leo" combination will be repeated once again ..?
Talk..”Leo” combination will be repeated once again ..?

మరి ఈ మూవీ తర్వాత విజయ్ దర్శకుడు వెంకట్ ప్రభుతో చేస్తున్న “గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” లో మరో సారి విజయ్ తో త్రిష కనిపించనున్నట్టుగా కొన్ని రూమర్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఈ మూవీ లో ఒక కీలక క్యామియో రోల్ కి అయితే ఒక స్టార్ నటి అవసరం ఉందట . దానికి ఇప్పుడు త్రిష పేరు పరిశీలనలో ఉన్నట్టుగా ఇప్పుడు టాక్. మరి దీనిపై మరింత క్లారిటీ కూడా రావాల్సి ఉంది. ఇక ఈ మూవీ కి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా ఏ జి ఎస్ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఏడాది లోనే మూవీ రిలీజ్ కి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.