Weather Report: భాగ్యనగరంలో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

Weather Report: Temperatures crossed 40 degrees in Bhagyanagar
Weather Report: Temperatures crossed 40 degrees in Bhagyanagar

మార్చి నెల మొదటి వారం నుంచే ఎండలు మండిపోతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో 40 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ ఏడాది మార్చి నుంచే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వడగాల్పుల తీవ్రతకు భయపడి ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని జూబ్లీహిల్స్‌, కార్వాన్‌ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 40 సెల్సియస్‌ డిగ్రీలు దాటుతోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మార్చి నెల ముగిసే సరికే 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవుతుండగా.. మధ్యాహ్నం నుంచి వడగాల్పులు వీస్తున్నాయి. రహదారులపై సిగ్నళ్ల వద్ద ద్విచక్ర వాహనదారులు ఎండకు మాడిపోతున్నారు. మున్ముందు ఎండలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటించకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.