యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా కాజల్ అగర్వాల్, అలాగే రకుల్ ప్రీత్ సింగ్ సహా సిద్ధార్థ్ తదితరులు ముఖ్య పాత్రల ల్లో దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ మూవీ “ఇండియన్ 2” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్నా ఈ మూవీ ని మేకర్స్ ఆల్రెడీ జూన్ లో రిలీజ్ కు తీసుకొస్తున్నట్టుగా ఖరారు చేశారు. అయితే ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ విషయంలో ఒక ట్విస్ట్ చోటు చేసుకున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.
మరి వీటి ప్రకారం ఇండియన్ 2 రిలీజ్ జూన్ నుంచి జూలై నెలకు మారినట్టుగా వినిపిస్తుంది. ఇది వరకు జూన్ 13న రిలీజ్ ఉంటుంది అన్నట్టుగా టాక్ ఉంది . ఇప్పుడు ఇది జూలై చివరికు మారినట్టుగా తాజా బజ్. మరి దీనిపై అధికారిక క్లారిటీ మాత్రం ఇంకా రావాల్సి ఉన్నది . ఇక ఈ భారీ మూవీ కి అనిరుద్ సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ మూవీ కి మరో సీక్వెల్ కూడా ఉన్నట్టుగా టాక్ ఉంది.