ఈ సినిమాతో కాజల్ కొత్త ట్రెండ్ ను సృష్టించబోతోంది!

Kajal is going to create a new trend with this movie!
Kajal is going to create a new trend with this movie!

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌ లో ఒక మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అయితే, ఈ మూవీ లో ఇప్పుడు మరో హీరోయిన్ కనిపించబోతుంది. హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఒక కీలక పాత్రలో నటించబోతుంది.అయితే ఆమె పాత్ర హీరోయిన్ పాత్ర కాదు అని, ఒక సరికొత్త పాత్రలో కాజల్ అగర్వాల్ నటించబోతుంది అని తెలుస్తుంది .

ముఖ్యంగా కాజల్ అగర్వాల్ పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని మంచి టాక్. ఈ పాత్రని దర్శకుడు బాబీ చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశాదంట . కాగా ఈ మూవీ లో ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్, చాందిని చౌదరి మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ఫోర్ మూవీ పై సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ మూవీ కి థమన్ సంగీతం అందిస్తున్నారు.