శుభవార్త : ‘ఇండియన్ 2’ పై క్రేజీ అప్డేట్ ..!

Good News : Crazy Update on 'Indian 2' ..!
Good News : Crazy Update on 'Indian 2' ..!

విజువల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ఇండియన్ 2. అయితే , ఈ మూవీ గురించి ఇప్పుడు ఒక క్రేజీ గాసిప్ వినిపిస్తోంది. ఇండియన్ 2 లో కమల్ క్యారెక్టర్ గురించి చాలా చోట్ల ఒక వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుందని.. ఈ వాయిస్ ఓవర్ ని రామ్ చరణ్ చెప్పబోతున్నాడు అని తెలుస్తుంది . ఈ వాయిస్ ఓవర్ మూవీ పై బలమైన ముద్రను వేస్తోందని, అలాగే కమల్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ని ఇస్తోందని తెలుస్తోంది.

Good News : Crazy Update on 'Indian 2' ..!
Good News : Crazy Update on ‘Indian 2’ ..!

అందుకే, ఈ వాయిస్ ఓవర్ ని రామ్ చరణ్ చెబుతున్నారంట . చరణ్ – శంకర్ కలయికలో గేమ్ చేంజర్ వస్తున్న సంగతి తెలిసిందే. అందుకే, చరణ్ ఇండియన్ 2 కోసం తన వాయిస్ ను వినిపించబోతున్నాడట. ఇక భారీ అంచనాలు ఉన్న ఈ మూవీ ని శంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు, కాగా ఈ సినిమా ని లైకా ప్రొడక్షన్స్, రెడీ జెయింట్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ‘ఇండియన్ 2’లో కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తుంది . అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తుంది .