“కల్కి 2898 ఎడి” గ్రాఫిక్స్ పై దర్శకుడు నాగ్ అశ్విన్ ఫన్ ..!

Director Nag Ashwin Fun on “Kalki 2898 AD” Graphics ..!
Director Nag Ashwin Fun on “Kalki 2898 AD” Graphics ..!

ప్రస్తుతం ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan), అమితాబ్ బచ్చన్ (Amitab Bachchan) లు కీలక పాత్రల్లో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ వరల్డ్ లెవెల్ మూవీ “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా ఈ మూవీ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు .

అయితే ఈ మూవీ విషయంలో ఈ చిత్ర నిర్మాత అశ్వనీదత్ గారి వారసురాలు అలాగే యువ నిర్మాత అయినటువంటి స్వప్న దత్ ఇన్స్టా స్టోరీ వైరల్ గా మారింది. దర్శకుడు నాగ్ అశ్విన్ తో మాట్లాడుతున్నట్టుగా ఫన్ కన్వర్జేషన్ ను తెలిపారు. సీజీ కి వర్క్ చేస్తున్న వారు అంతా హైదరాబాద్ నుంచి ఎలెక్షన్స్ కు వెళ్లిపోయారు అని దర్శకుడు అంటే స్వప్న దత్ ఎన్నికల విషయమై ఎవరు గెలుస్తారు అని అడిగాడు .

Director Nag Ashwin Fun on “Kalki 2898 AD” Graphics ..!
Director Nag Ashwin Fun on “Kalki 2898 AD” Graphics ..!

దీనికి ఎవరు గెలిస్తే నాకెందుకండి నా షాట్స్ ఎప్పుడు వస్తాయో నాకు కావాలి కానీ అని అంటూ బదులిచ్చాడు. ఇది మాత్రం మంచి ఫన్ గా ఉందని చెప్పుకోవాలి . ఇక దీనితో ఈ భారీ మూవీ గ్రాఫిక్స్ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అని చెప్పాలి. మరి ఈ మాసివ్ ప్రాజెక్ట్ ఈ జూన్ 27న గ్రాండ్ గా రిలీజ్ కానున్నది .