బిగ్గెస్ట్ ఐమ్యాక్స్ స్క్రీనింగ్ లో “కల్కి” మూవీ ని చూడనున్న నాగ్ అశ్విన్!

Nag Ashwin will watch the movie "Kalki" in the biggest IMAX screening!
Nag Ashwin will watch the movie "Kalki" in the biggest IMAX screening!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ సినిమా కల్కి 2898ఎడి. ఈ మూవీ ధియేటర్లలో విడుదల అయ్యి ప్రేక్షకులని , అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ మూవీ ఈ వారాంతంకి వెయ్యి కోట్ల రూపాయల క్లబ్ లో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ మూవీ కి దర్శకత్వం వహించిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ యూఎస్ఏ ప్రాంతంలోని బిగ్గెస్ట్ ఐమ్యాక్స్ స్క్రీనింగ్ లో కల్కి మూవీ న్ని చూడనున్నారు.

Nag Ashwin will see the movie "Kalki" in the biggest IMAX screening!
Nag Ashwin will see the movie “Kalki” in the biggest IMAX screening!

ఈ శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకి TCL చైనీస్ ధియేటర్స్ లో మూవీ చూడనున్నారు నాగ్ అశ్విన్. ఈ భారీ బడ్జెట్ సినిమా లో దీపికా పదుకునే, దిశా పటాని లు హీరోయిన్స్ గా నటించగా, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీ లాంగ్ రన్ లో మరింత వసూళ్లని రాబట్టే అవకాశాలు ఉన్నాయి.