టాక్.. నాని “సరిపోదా శనివారం”మూవీ మళ్ళి వాయిదా?

Saripoda Sanivaram
Saripoda Sanivaram

నాచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న అవైటెడ్ మూవీ సరిపోదా శనివారం”. మరి ఒక క్రేజీ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీ లో ఎస్ జె సూర్య సాలిడ్ రోల్ చేస్తుండగా ఈ మూవీ పై మంచి బజ్ ఆల్రెడీ అయితే ఉన్నది . ఇక ఎప్పటికప్పుడు మేకర్స్ కూడా సాలిడ్ అప్డేట్స్ ను అందిస్తుండగా ఇపుడు ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Saripoda Sanivaram
Saripoda Sanivaram

అయితే ఇప్పుడు ఈ మూవీ వాయిదా పడినట్టుగా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆగస్ట్ 29 నుంచి కేవలం కొన్ని రోజులు వెనక్కి వెళ్లినట్టుగా టాక్. దీనితో ఈ మూవీ ఈ సెప్టెంబర్ రెండో వారానికి మారినట్టుగా టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో ఇంకా వేచి చూడాలి. ఇక ఈ మూవీ కి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.