సత్యదేవ్ “కృష్ణమ్మ”మూవీ ఓటిటి పార్ట్ నర్ ఫిక్స్ ..!

Satyadev
Satyadev "Krishnamma" Movie OTT Part Ner Fix ..!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అయిన సత్యదేవ్ తదుపరి కృష్ణమ్మ అనే యాక్షన్ డ్రామా లో కనిపించనున్నాడు . మే 10, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా విడుదల కానున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ కి సంబందించిన డిజిటల్ హక్కుల పై తాజాగా ఒక క్లారిటీ కూడా వచ్చింది. నేడు రిలీజ్ చేసిన సరికొత్త పోస్టర్ లో మేకర్స్ డిజిటల్ పార్ట్ నర్ కు సంబందించిన విషయం పై అప్డేట్ ని అందించారు.

Satyadev "Krishnamma" Movie OTT Part Ner Fix ..!
Satyadev “Krishnamma” Movie OTT Part Ner Fix ..!

ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయిన అమేజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్నారు . థియేట్రికల్ రిలీజ్ అనంతరం ఈ మూవీ ప్రైమ్ వీడియో లోకి రానున్నది . వివి గోపాల కృష్ణ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ మూవీ లో ఆతిరా రాజ్ మహిళా ప్రధాన పాత్రలో నటించగా, లక్ష్మణ్ మీసాల, రఘు కుంచె, నందగోపాల్ మరియు ఇతరులు కీలక పాత్రలు పోషించారు. అరుణాచల క్రియేషన్స్‌ పతాకంపై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ విడుదలని నిర్వహించనున్నాయి.